ఇల్లందు పోరాటాల పురిటిగడ్డ.. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. మీకు మీరుగా ఆలోచించి చైతన్యంతోటి.. ఏది మంచిది.. ఏది చెడు అని ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం రానంతవరకు దేశం బాగుపడదని తెలిపారు. ఓటు వేసే ముందు కేసీఆర్ మాటలను చర్చ పెట్టాలని తెలిపారు. ఎన్నికలు రాగానే గోల్ మాల్ కాకూడదు. ఏం చేస్తే మనకు లాభం జరుగుతుందో అదే చేయాలి. ప్రజల చేతుల ఉన్న వజ్రాయుధం.. మీ తలరాతను మార్చేది మీ ఓటే.
మార్కెట్ లో పోయి కూరగాయలను కొనెటప్పుడు పుచ్చులను ఏరి పారేస్తాం.. అలాగే ఆలోచనతో ఓటు వేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్ని పనులు జరిగాయో మీకు తెలుసు. ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టింది 10.. చేసింది 100 అన్నారు. రైతుబంధు, దళిత బంధు, రైతుబీమా తెస్తామని ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టలేదు. తండాలన్నీ గ్రామపంచాయతీలుగా మారాయి. 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ప్రధాని మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది.