Breaking News : కాంగ్రెస్ లో చేరనున్న విజయశాంతి..?

-

BRS లోకి బీజేపీ నేత విజయశాంతి వెళ్లనున్నట్టు ఇవాళ ఉదయం రూమర్స్ వినిపించాయి. కానీ వాస్తవానికి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నారు విజయశాంతి. తాజాగా ట్వీట్. అసలు బీజేపీ నేత విజయశాంతి ఏం ట్వీట్ చేసిందంటే…25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం, అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చిందని చెప్పారు. ఏ పదవి ఏనాడు కోరుకోకున్నా…ఇప్పటికీ అనుకోకున్నా కూడా…అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం అంటూ వెల్లడించారు.

మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకం అవుతాం అని కాదన్నారు. నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వం పై తప్ప, నాతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదని వెల్లడించారు. రాజకీయ పరంగా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనీ మనఃపూర్వకముగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం అన్నారు విజయశాంతి. దీంతో బీఆర్ఎస్ లోకి వెళ్తుందని రూమర్స్ వినిపించాయి. కానీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ ని గద్దె దించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని.. కాంగ్రెస్ లోకి వెళ్లనుంది విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news