మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ సూర్యపేట జిల్లాలో పర్యటించి.. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హూజూర్ నగర్ లో ఐటీఐ కాలేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన తరువాత క్యాంపు కార్యాలయంలో షాద్ ముబారక్, కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.
2009లో తాము ప్రారంభించిన హౌసింగ్ కాలనీకే బీఆర్ఎస్ డబుల్ బెడ్ రూం ఇళ్లు అని చెబుకుంటుందన్నారు. 2025 జనవరి వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులైన వారందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం కుంటు పడిందన్నారు. బీఆర్ఎస్ నేతలు మాటలు చెప్పడమే తప్ప.. పనులు చేయడం శూన్యం అన్నారు. ప్రజా పాలనలో ఇప్పటికే రైతులకు రెండు దశల్లో రుణమాఫీ చేశామని.. మూడో దశలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపారు.