రెడ్ బుక్‌లో అందరి పేర్లు రాస్తున్నాం..అందరి అంతు చూస్తాం – కౌశిక్ రెడ్డి

-

రెడ్ బుక్‌లో అందరి పేర్లు రాస్తున్నాం..అందరి అంతు చూస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్పడుతున్న “ఫ్లైయాష్‌” కుంభకోణాన్ని పూర్తి ఆధారాలతో సహా బైట పెట్టారు బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నా దగ్గరి మిత్రుడు అఖిల్ అనే వ్యక్తి ఫ్లై యాష్ వల్ల బండి స్కిడ్ అయ్యి మరణించాడన్నారు.

padi koushik reddy

పేదోళ్ల శవాల మీద పైసల్ ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్‌కి అఖిల్ శాపం.. పాపం ఖచ్చితంగా తగులుతుందని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రెడ్ బుక్‌లో అందరి పేర్లు రాస్తున్నాం, మేం అధికారంలోకి వచ్చిన నాడు పరేషాన్లో పడుతారు.. ఇది బెదిరింపు కాదు మీ బాధ్యత మీకు గుర్తు చేస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news