మునుగోడు మండలం పలివెలలో మంగళవారం సాయంత్రం ఉద్రుక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలివెలలో ఓవైపు బిజెపి, మరోవైపు టిఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. అయితే ప్లాన్ ప్రకారమే టిఆర్ఎస్ ఈ దాడులకు పాల్పడిందని బిజెపి నేతలు మండిపడుతున్నారు.
తాజాగా పలిమేలలో జరిగిన ఈ దాడిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరణ ఇచ్చారు. పక్కా ప్రణాళికతో బిజెపి ఈ దాడికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. బిజెపి అనుచరులను దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు. టిఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లో కర్రలు ఉంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఘర్షణలో తనతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి అని చెప్పారు. మరి పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ కి బిజెపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.