కేటీఆర్‌ ఛాలెంజ్ స్వీకరించిన పవన్‌ కళ్యాణ్‌

-

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ ను స్వీకరించారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. నేడు జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా చేనేత వస్థ్రాలు ధరించి.. ఫోటోలు, పోస్ట్‌ చేయాలని సచిన్‌ టెండూల్కర్‌, పవన్‌ కళ్యాణ్‌, ఆనంద్‌ మహీంద్రాలకు మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ ను స్వీకరించారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. దీన్ని స్వీకరించిన జనసేనాని.. రామ్‌ భాయ్‌ ఛాలెంజ్‌ స్వీకరించాను. చంద్రబాబు, మంత్రి బాలినేని శ్రీనివాస్‌, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ లకు నామినేట్‌ చేస్తున్నా అంటూ ఫోటోలను షేర్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌. ఇక పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆ ట్వీట్‌ కు మంత్రి కేటీఆర్‌ థ్యాంక్యూ అన్నా అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news