ఎడిట్ నోట్: కేసీఆర్ కంగారు…!

-

అవును ఎప్పుడూలేని విధంగా ఇప్పుడు కేసీఆర్ లో కంగారు కనబడుతుంది…ఎక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా? అనే టెన్షన్ బాగా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. పైకి బీజేపీపై యుద్ధం చేస్తున్నట్లు కాస్త ధైర్యంగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు గాని…లోలోపల మాత్రం బీజేపీతో ఎక్కడ అధికారానికి దూరమవుతాము అనే కంగారు కేసీఆర్ లో ఉందని చెప్పొచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కాకుండా కమలం పార్టీనే టార్గెట్ చేయడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందవచ్చనే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని చెప్పొచ్చు.

అసలు గత కొన్ని రోజులుగా కేసీఆర్ కేవలం కమలం పార్టీనే టార్గెట్ చేస్తున్నారు తప్ప…కాంగ్రెస్ జోలికి పోవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తప్పులని బయటపెడితే తమకు ఏమన్నా బెనిఫిట్ అవుతుందని కేసీఆర్ అనుకుంటున్నట్లు ఉన్నారు..అందుకే కమలం పార్టీనే టార్గెట్ చేస్తున్నారు…అదే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే..ఆ పార్టీ ఎలాగో కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంది. దాని వల్ల ఆ పార్టీకి ఇంకా అడ్వాంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది..అందుకే ఆ పార్టీని ఏ మాత్రం టార్గెట్ చేయకుండా కమలంపైనే ఫోకస్ పెట్టారు.

సరే కమలం పార్టీని టార్గెట్ చేయడం వల్ల కేసీఆర్ కు ఎంత బెనిఫిట్ వస్తుందో ఫ్యూచర్ లో తెలుస్తుంది..కానీ ఈలోపు బీజేపీ వల్లే కేసీఆర్ కు ఎక్కువ ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తుంది…ఓ వైపు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే..మరోవైపు క్షేత్ర స్థాయిలో బలపడటమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఈ మధ్య బీజేపీ మరింత దూకుడుగా రాజకీయం చేస్తూ…కేసీఆర్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతుందనే చెప్పొచ్చు.

పైగా మునుగోడు ఉపఎన్నిక వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కు మరింత టెన్షన్ పెరుగుతుంది..ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కారుని కమలం చిత్తుగా ఓడించింది. ఇప్పుడు మునుగోడులో కూడా  ఓడితే…అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి బాగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే మునుగోడులో గెలవడానికి కేసీఆర్ బాగానే కష్టపడుతున్నట్లు ఉన్నారు..ముఖ్యంగా బీజేపీ దెబ్బకు..ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ కోసం దళితబంధు ప్రకటించారు…ఇక ఇప్పుడు పెన్షన్లు పెంచే కార్యక్రమం మొదలుపెట్టారు.

57 ఏళ్లు నిండిన వాళ్ల జాబితా తయారైందని, మొత్తం 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్‌ ఇవ్వబోతున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. డయాలసిస్‌ పేషంట్లకు ఉచిత డయాలసిస్‌, బస్‌ పాస్‌లకు తోడుగా నెలకు రూ.2016 చొప్పున పెన్షన్‌ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇంకా పలు హామీలు ఇచ్చారు. అయితే మిగతా సమయంలో ఈ ఆఫర్లు ప్రకటించి ఉంటే…కేసీఆర్ ప్రజల కోసం ఏదో చేస్తున్నారని అంతా భావించేవారు. కానీ ఈయన ఏదైనా ఉపఎన్నిక ఉన్నప్పుడే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నారు. అది కూడా బీజేపీని ఎదురుకోవడానికే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్..కేంద్రంపై పోరాటం చేస్తున్నా సరే..లోపల బీజేపీ దెబ్బకు ఎక్కువ కంగారు పడుతున్నట్లున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news