పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు, ఫీజులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాల ఫీజులపై విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేసింది. ఈ ఏడాది ఫీజు పెంచవద్దని ఏప్రిల్ 21న జీవో 46 జారీ అయిందని కౌంటర్ లో పేర్కొంది విద్యా శాఖ. జీవో ప్రకారం ట్యూషన్ ఫీజు నెలవారీగా తీసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది. 55 పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చాయని.. షోకాజ్ నోటీసులు జారీ చేసామని విద్యా శాఖ పేర్కొంది.

నోటీసులకు 47 పాఠశాలలు వివరణ ఇచ్చాయని అని కోర్ట్ కి వివరించారు. అధికారుల నుంచి నివేదికలు రాగానే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని కౌంటర్ దాఖలు చేసారు. జీవో 46ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసిన విద్యాశాఖ… ఎవరిని క్షమించేది లేదని పేర్కొంది. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసారు.