జులై 12న తెలంగాణకు ప్రధాని!

-

ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. జులై 12న మోదీ రాష్ట్రానికి వచ్చే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ల పీరియాడిక్‌ ఓవర్‌ హాలింగ్‌ (పీఓహెచ్‌) కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నాయి. బీజేపీ మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెలాఖరులోపు ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉండగా కార్యక్రమం వాయిదా పడిందని, జులై 12న వస్తారని పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. అదే రోజు వరంగల్‌లో సభ నిర్వహించేందుకు చర్చిస్తున్నామని, రెండు రోజుల్లో ప్రధాని పర్యటన ఖరారు అవుతుందన్నారు.

మరోవైపు హైదరాబాద్‌ వేదికగా జులై 8న ఏకంగా 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాదే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఈ కీలక సమావేశం పార్టీపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే వివిధ రాష్ట్రాల పార్టీ బాధ్యులతో కీలక సమావేశానికి హైదరాబాద్‌ను వేదిక చేసుకున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news