కేసీఆర్ అవినీతి ఇప్పుడు ఢిల్లీ దాకా పాకింది – ప్రధాని మోడీ

-

సీఎం కేసీఆర్ అవినీతి ఇప్పుడు ఢిల్లీ దాకా పాకిందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. వరంగల్‌లోని ఆర్ట్స్‌ కాలేజీలో విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు. మొదటిసారి కేసీఆర్ పేరు తీస్తూ ఎదురుదాడికి దిగిన ప్రధాని మోడీ…కేసీఆర్‌ సర్కార్‌ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో అవినీతి అరోపణలు లేకుండా ఏ ప్రాజెక్టు లేదు.

అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కేసీఆర్ ప్రభుత్వం అంటూ ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ అవినీతి ఇప్పుడు ఢిల్లీ దాకా పాకిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్‌ లకు అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు దేశ ప్రధాని మోడీ.దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంతో ఉందని… నాగ్‌పూర్‌-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌తో తెలంగాణకు ఎంతో ప్రయోజనం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ వరంగల్‌ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగానే కాజీపేటలో వ్యాగన్‌ తయారీ యూనిట్‌ అన్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news