ఓడియమ్మ..! కేజీ టమోటా విత్తనాల ధర రూ. 3 కోట్లు..

-

టమాటో ధరలు ఘోరంగా పెరిగిపోయాయి. వందకు తక్కువ లేదు. ఇంతకు ముందు మార్కెట్‌కు వెళ్తే రెండు మూడు కేజీలు తీసుకొచ్చే వాళ్లం.. కానీ ఇప్పుడు వాటి దిక్కే చూడటం లేదాయో.. కేజీ టమాటాలు వంద పెట్టి కొనేబదులు చికెన్‌ తెచ్చుకుని తినడం బెటర్‌ అనుకుంటున్నారు. అయితే మీకు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టమోటో విత్తనాలు ఉన్నాయి. వాటి ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ టమోటో గింజలు కిలో కొనాలంటే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టాలో తెలుసా? అక్షరాలా మూడు కోట్ల రూపాయలు. మూడు కోట్ల రూపాయలతో ఎంతో బంగారాన్ని, వజ్రాలను కొనుక్కోవచ్చు. కానీ వాటిన్నింటిని కాదని టమోటో గింజలను కొనేవారు కూడా ఉన్నారు. వారంతా బిలియనీర్లే. వీటిని ‘సమ్మర్ సన్’ అని పిలుస్తారు. యూరోపియన్ మార్కెట్లో ఇది అధికంగా లభిస్తాయి. కిలో ప్యాకెట్ ధర మూడు కోట్ల రూపాయలు. అంటే 5 కిలోల బంగారాన్ని కొనవచ్చు. ఎందుకు ఇంత కాస్ట్‌.. వీటివల్ల ఎంటంట ఉపయోగం..?

Commonly Cultivated Pure And Dried Tomato Seeds For Agriculture Admixture  (%): 2% at Best Price in Chandrapur | Gurudatta Agro Centre

 

హెజెరా జెనెటిక్స్ సంస్థ ఈ విత్తనాలను అమ్ముతోంది. ఈ విత్తనాలు చాలా ఖరీదైనవి. దానికి కారణం కూడా ఉంది. ఈ టమోటో విత్తనాల ప్రత్యేకత ఏంటంటే ప్రతి విత్తనం కూడా ఖచ్చితంగా మొక్కగా మొలుస్తుంది. అది 20 కిలో గ్రాముల టమోటాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ విత్తనం ద్వారా పుట్టిన మొక్కకు కాసిన టమోటాలలో ఎలాంటి విత్తనాలు ఉండవు. ప్రతి పంటకు రైతులు కొత్త విత్తనాలను కొనాల్సిందే. అందుకే వీటి ధర ఆకాశాన్ని అంటింది.

వీటి రుచి కూడా చాలా అసాధారణంగా ఉంటుందట. అన్ని టమోటాలతో పోలిస్తే సమ్మర్ సన్ టమోటో విత్తనాలకు కాసిన టమోటోలు చాలా రుచిగా ఉంటాయి. తినే కొద్ది మళ్లీ తినాలనిపిస్తుందట.. అంత ఖరీదైనవని తెలిస్తే మనం తినకుండా ఉంటామా..! అందుకే అధిక ధర ఉన్నప్పటికీ ఈ టమోటో విత్తనాలను కొని పంటలు పండించే వాళ్ళు అధికంగానే ఉన్నారు. ఆ టమోటాలను కొనేది కూడా ధనవంతులే. ఈ టమాటో విత్తనాలను హెజెరా జెనెటిక్స్ ప్రత్యేకంగా ఉత్పత్తి చేసింది. కేవలం ఈ విత్తనాలను ఉత్పత్తి చేయడానికి మాత్రమే ఆ సంస్థ పనిచేస్తుంది.

ఈ విత్తనాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, నాణ్యత అన్నింటి పైన చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఈ విత్తనాలను కనిపెట్టే ప్రయాణంలో హెజెరా సంస్థ ఎన్నో ప్రయోగాలు చేసింది. కిలో మూడు కోట్ల రూపాయలు అయినప్పటికీ ఒక్క విత్తనం 20 కేజీల టమోటాలను ఇస్తుంది కాబట్టి, అంతకు మించి లాభం వీటితో వచ్చేస్తుందని చెబుతోంది ఈ సంస్థ.

Read more RELATED
Recommended to you

Latest news