త్వరలో ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ ఇస్తామని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రకటన చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 7 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు.
ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్ళలాంటి వారని అన్నారు. త్వరలో ఆర్టీసీ స్టాఫ్ కు పిఆర్సిపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలిగించాలనే ఉద్దేశంతో వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
కాగా, సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 7 వ తేది నుంచి 15 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.