సీఎం కేసీఆర్ పై పోటీ చేయాలనే ప్రతిపాదన : కూనంనేని

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేయాలనే ప్రతిపాదన వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఎవరు  ఎక్కడ పోటీ చేయాలనే దానిపై పార్టీ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దొంగే దొంగ అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని విమర్శించారు కూనంనేని. ఇండియా కూటమికి వెళ్లి మిత్రద్రోహం చేశామని బీఆర్ఎస్  చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు.

బీఆర్ఎస్ తో పొత్తు కంటే ముందే జాతీయ కూటమిలో కమ్యూనిస్టులున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2004లో  కాంగ్రెస్ తో ఎందుకు  పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు కూనంనేని సాంబశివరావు. కమ్యూనిస్టులంటే  కేసీఆర్ కు నచ్చదన్నారు. కేసీఆర్ నిమిషానికో మాట మారుస్తారని సీఎం తీరును కూనంనేని సాంబశివరావు  తప్పుబట్టారు. కనీస రాజకీయ విలువలు కూడ  కేసీఆర్ పాటించడంలేదని  మండిపడ్డారు.  

సెప్టెంబర్ 17న విలీన దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 11 నుంచి బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో భారీ సభను నిర్వహిస్తామన్నారు. ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొంటారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. తమ సత్తా ఏంటో బీఆర్ఎస్ కి చూపుతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version