రేపటి నుంచి వరంగల్ ఎనమముల మార్కెట్ లో కొనుగోళ్లు ప్రారంభం

-

రేపటి నుంచి వరంగల్ ఎనమముల మార్కెట్ లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి వరంగల్ మార్కెట్ ప్రారంభం అవుతుందని, అధ్వాన్న గోనె సంచులు, యూరియా బస్తాలు తప్ప అన్ని సంచుల కోసం రైతులకు 30 రూపాయలు చెల్లించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని *రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

గన్నీ బ్యాగుల అంశంపై నేడు హనుమకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో మంత్రి రైతు సంఘాల నాయకులు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి, చర్చించారు.

ఈ సమావేశంలో రేపటి నుంచి మార్కెట్ ప్రారంభించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని వెల్లడించారు. రైతులు కూడా వీలైనంత వరకు మంచి బ్యాగులు వినియోగించాలని కోరారు. మిగతా మార్కెట్ లలో గన్నీ బ్యాగుల నాణ్యత, ధరపై అధ్యయనం చేసేందుకు ఇద్దరు రైతులు, ఇద్దరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇద్దరు అధికారులతో కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని, 26వ తేదీలోపు నివేదిక ఇస్తారని, నివేదిక ఇవ్వగానే మరోసారి సమావేశం పెట్టి దీనికి శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news