నేను తప్పు చేస్తే మా నాన్నే జైలుకు పంపుతారు – నారా లోకేష్

-

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం జగన్ మాదిరిగా తండ్రిని అడ్డుపెట్టుకొని పత్రిక స్థాపించలేదని, వ్యాపారాలు చేయలేదని అన్నారు. శుక్రవారం మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల పట్ల సీఎం జగన్ కి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. జగన్ ది జైలు లైఫ్ అయితే.. నాది కాలేజీ లైఫ్ అన్నారు.

తాను ఏ ఆరోపణ చేసిన ఆధారాలతోనే చేస్తానని.. తాను తప్పు చేస్తే కచ్చితంగా మా నాన్న జైలుకు పంపిస్తారని అన్నారు. తాను ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు నారా లోకేష్. మీడియా పైన పరువు నష్టం కేసులు పెడతానన్నారు. జగన్ ఓ నియంత అని.. తల్లి, చెల్లిని బయటకు పంపించారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news