రాహుల్ గాంధీ వరంగల్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీ కాంగ్రెస్. వరంగల్ సభకు దాదాపు 5 లక్షల మంది జన సమీకరణను టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలు జనసమీకరణపై నజర్ పెట్టారు. భారీ జనసమీకరణతో సభను విజయవంతం చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వరంగల్ కు భారీగా కాంగ్రెస్ శ్రేణులు కదిలివస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రేమమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో భారీగా జనసమీకరణ చేశారు. ఉమ్మడి ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 30 వేల మంది వరంగల్ సభకు బయలుదేరారు. నల్లగొండ నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 50 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు సభకు వస్తున్నారు. మెదక్ జిల్లా నుంచి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జనసమీకరణ జరిగింది. రాహుల్ గాంధీ సాయంత్రం 4.50 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి ర్యాలీగా సభాస్థలికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు సభాస్థలికి చేరుకుని 8 గంటల వరకు వరంగల్ లోనే ఉంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకుంటారు.
రాహుల్ సభకు భారీగా జనసమీకరణ…. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీ కాంగ్రెస్
-