రాహుల్ గాంధీ వ్యాకయ్లపై స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న లోక్‌సభ లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని పలు వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. హిందువులపై, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్, అగ్నివిర్ అంశాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు తొలగించారు. ఇక అటు హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి.
ఇవాళ మీడియాతో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ… 1975వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తి ని దెబ్బతిసి, వేలాది మంది సిక్కులని ఊచ కోత విధించిన వారు పార్లమెంట్ లో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హిందువుల మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకువాలని డిమాండ్ చేశారు. హిందువులు అసత్యాలు పలుకుతారని, హింసలకి పాల్పడతారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతిసారని తెలిపారు. రాహుల్ గాంధీ భారత దేశ హిందూ ప్రజల కి క్షమాపణ చెప్పాలని కోరారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి.