కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోసారి తెలంగాణకు రావడానికి మొహం చాటేశారు రాహుల్ గాంధీ. ఆగస్ట్ 24న జరగవలసిన రాహుల్ తెలంగాణ పర్యటన కూడా రద్దు చేసుకున్నారట. రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం నడుస్తున్న నేపథ్యంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు వెనకడుగు వేశారట రాహుల్ గాంధీ.

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని మేధావులు సైతం వ్యతిరేకిస్తున్న సమయంలో రావడం కరెక్ట్ కాదని ఫీడ్ బ్యాక్ వెళ్లినట్లు సమాచారం అందుతోంది. ఈ తరునంలోనే… మరోసారి తెలంగాణకు రావడానికి మొహం చాటేశారు రాహుల్ గాంధీ. దీంతో మరో 3 రోజుల్లో జరగవలసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పర్యటన రద్దయినట్లు సమాచారం.