తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండల తీవ్రత తగ్గి పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్లలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం అంతా మంచు ప్రదేశం వలె మారిపోయింది. దీంతో ప్రజలు ఆ వాతావరణాన్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.
హైదరాబాద్ లోని కొంపల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, కొండాపూర్ ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతోంది. మియాపూర్ లో వడగండ్ల వాన కురిసింది. మరో 3 గంటలు పాటు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు కరీంనగర్ లో భారీ వర్షం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి సభకు అంతరాయం ఏర్పడింది. గాలికి టెంట్లు కూలీపోయాయి. వర్షం రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంటుందా..? ఉండదా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో వడగండ్ల వాన కురిసినట్టు సమాచారం.