హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, బోరబండ, కూకట్పల్లి, మాదాపూర్, ఫిలింనగర్ తదితర ప్రాంతాల్లో వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. GHMC పరిధిలో సాయం కోసం 9000113667 నంబర్ ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
కాగా, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో భాగ్యనగరంలోని రోడ్లపై నీరు నిలవడంతో కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని చాలామంది సోషల్ మీడియా వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఐటి కంపెనీలు కూడా వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తే మంచిదని పోస్టులు చేస్తున్నారు.