గత రెండు రోజులుగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఓ వార్త వైరల్ అవుతోంది. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతున్నట్లు టీడీపీ పార్టీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయి. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ముఖ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని.. ఆ వార్తల సారాంశం.
గతంలో రాజాసింగ్ టీడీపీ లోనే ఉండి, బీజేపీలోకి వచ్చారు. ఇక ఇప్పుడు మళ్లీ.. టీడీపీ లోకి వస్తారని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై స్వయంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంని ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. తాను టిడిపిలో చేరేది లేదని స్పష్టం చేశారు.