వైఎస్ వివేకా హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువురుని సిబిఐ అరెస్ట్ చేసింది. ఇదే క్రమంలో జగన్ మరో బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఇక జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి సైతం అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. కానీ అవినాష్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ తరుణంలోనే వివేకాకు చెందిన 90 ఎకరాలు రాయించుకుంది సునీతరెడ్డి. పులివెందుల మునిసిపాలిటీ రంగాపురం నందు 48.24 ఎకరాలు, రావులకోలను గ్రామం సింహాద్రిపురం మండలం నందు 21.49 ఎకరాలు, నిడివెల్ల గ్రామం సింహాద్రిపురం మండలంలో 10.63 ఎకరాలు, తెలికి గ్రామం సింహాద్రిపురం మండలం లో 9.47 ఎకరాలు.. మొత్తము 89.83 ఎకరాలు రాయించుకుంది సునీతరెడ్డి. ఈ భూముల వివరాలన్నీ 2023 జనవరి నెలలో వైయస్ వివేకానంద రెడ్డి గారి పేరు మీద నుండి తన భార్య వైయస్ సౌభాగ్యమ్మ , ఆమె కుమార్తె వైయస్ సునీత గారి పేరు మీదకు మారాయి. అయితే, దీనిపై వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.