టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం… నిలదీసిన రైతులు

వరి కోతలు ముగిసి రోజులు గడుస్తున్నా… ఇంకా వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి. దీంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ లు చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినా… అందుకు తగ్గట్లు కొనుగోలు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Rasamayi balakishan sensational comments on Telangana

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు షాక్ ఇచ్చారు రైతులు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రసమయిని నిలదీశారు రైతులు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా చేశారు. అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినా ఎమ్మెల్యేను రైతులను వదల లేదు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నామని అకాల వర్షంతో నష్టం వాటిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. రైతులు అడ్డగించడంతో ఒక్కసారిగా రసమయి షాక్ అయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు రైతులకు మధ్య వాగ్వాదం.