హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో GHMC కమిషనర్ అమ్రపాలి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ మహా నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు GHMC కమిషనర్ అమ్రపాలి ప్రకటించారు. పౌరులందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ఆదేశించారు GHMC కమిషనర్ అమ్రపాలి.
పిల్లలను, వృద్ధులను ఒంటరిగా రోడ్లపై నడవనివ్వవద్దన్నారు. పాదచారులు ద్విచక్ర వాహనదారులు నీటిలోకి నడవకూడదని కోరారు GHMC కమిషనర్ అమ్రపాలి. GHMC పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఏదైనా అత్యవసర లేదా సమస్య ఎదురైతే, 040 21111111 లేదా 9000113667 (DRF)కి కాల్ చేయండి @GHMConlineలో సంప్రదించండని కోరారు GHMC కమిషనర్ అమ్రపాలి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కారణంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ కంపెనీలు, ఐటీ ఈఎస్‌కు ఉద్యోగుల భద్రత రీత్యా వర్క్‌ఫ్రం హోంకు అనుమతి ఇవ్వాలని సూచనలు చేశారు. ఐటీ కంపెనీలకు వర్క్‌ఫ్రం హోం అనుమతించాలని కోరారు పోలీసులు.