కమీషన్ల కక్కుర్తి కోసమే ప్రాజెక్ట్ ల రీడిజైనింగ్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

కమీషన్ల కక్కుర్తి కోసమే ప్రాజెక్ట్ ల రీడిజైనింగ్ చేశారని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. ముఖ్యంగా సీడబ్ల్యూసీ అనుమతి మేమే తీసుకొచ్చామని బీఆర్ఎస్ చెబుతోంది. సీతారామ ప్రాజెక్ట్ కి సీడబ్ల్యూసీ అనుమతులు పూర్తి స్తాయిలో రాలేదు అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో NSP చేయడానికి  మేము ముందుకు తీసుకెల్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పిన్నెపాక వద్ద కాలువకు భూసేకరణ  15, 795 చేయాల్సి ఉంది. దీనికి రూ.115 కోట్లతో మేము మొదలు పెట్టాం. ప్రధాన కాలువ 73 కిలోమీటర్ల వరకు ఆయా కట్టు రూ.663 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతుంది. 1600 ఎకరాల భూ సేకరణ చేస్తున్నాం. కాలువ నిర్మాణం ద్వారా 38వేల ఎకరాలకు నీటి సరఫరా జరుగుతుంది. రాజీవ్, ఇందిరా సాగర్ కలిపి రూ.3,505 కోట్లతో పూర్తి కావాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని రూ.18,286 కోట్లకు పెంచారని మంత్రి తెలిపారు. దీనిని చూస్తేనే స్పష్టంగా అర్థం అవుతుంది. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని వెల్లడించారు. రకరకాల సాకులతో ఆ ప్రాజెక్ట్ ను వదిలి సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభించారని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news