తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి శుభవార్త..రూ. 79.57 కోట్లు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు కురిసిన భారీ వర్షాల వలన జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. 79,216 మంది రైతులకు చెందిన 79,574 ఎకరాల పంట నష్టానికి 79.57 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇక రైతుల అకౌంట్లకే నేరుగా జమా చేసేటట్టు ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్.
ఇక రాష్ట్ర సివిల్ సప్లై భవన్లో ధాన్యం సేకరణ పై జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఖరీఫ్ సీజన్లో వచ్చే వరి ధాన్యం సేకరణకు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. రైతుల నుంచి రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని.. ఖరీఫ్ సీజన్లో రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని నిర్నిత గడువు లోగా బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందించాలని వివరించారు.