రేవంత్ లక్కీ లాటరీ ముఖ్యమంత్రి.. ఎంపీ డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు

-

అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఎందుకు ఇవ్వలేదని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాది పాలన పై బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పై సంబురాలు జరుపుకుంటుందని.. ఆడపిల్లకు రూ.2500 ఇచ్చారా..? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ.4వేల నిరుద్యోగ భృతి ఇచ్చారా..? ఆడపిల్లలకు ఇస్తామన్నా స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 

ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకొని సంబురాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ఇప్పటివరకు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడిగితే.. బీజేపీ నేతలు నన్ను విమర్శిస్తున్నారని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. అది నోరేనా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓ సీఎం నోరు చేసుకొని మాట్లాడినందుకే ప్రజలు గద్దె దించిన సోయి తప్పినట్టు ఉన్నాడని ఫైర్ అయ్యారు. తిట్టకుంటే.. కేసీఆర్ కంటే తక్కువ అయిపోతానని సీఎం అనిపించుకోని కేసీఆర్ కంటే ఎక్కువ తిడుతున్నాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news