తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకుంది. నిన్న కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమై సీఎల్పీ నేత ఎంపికపై చర్చించారు. ఈ భేటీలో సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను మల్లి కార్జున ఖర్గే కు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారు.ఇవాళ ఉదయం భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పలువురు అధినేతలతో చర్చించారు.
చివరగా కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కేసీ వేణు గోపాల్ కీలక ప్రకటన చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రకటించారు. ఎల్లుండి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తారు. అంతా టీమ్ గా కలిసి పని చేస్తారు. తమ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.