చరిత్ర సృష్టించిన రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 08న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లిలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. వారికి ఎలా రాజకీయనేపథ్యం లేదు. రేవంత్ ఉస్మానియా వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి దగ్గరి బంధువు గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు నైమిషారెడ్డి ఏకైక సంతానం.

అయితే రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. కాంగ్రెస్ నుంచి తొలి సీఎంగా సరికొత్త చరిత్రను లిఖించారు. 2014, 2018 బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సీఎంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తొలిసారి బీఆర్ఎస్ యేతర పార్టీ నుంచి ఎన్నికైన సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచారు. అన్నింటికంటే ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ సీఎం కాలేరనే ఆనవాయితీని ఆయన బద్దలుకొట్టారు. పదునైన రాజకీయ వ్యూహాలు, విమర్శించిన వారిని సైతం మచ్చిక చేసుకునే నైజం రేవంత్ సొంతం. రాష్ట్రంలో కేసీఆర్ కి ధీటుగా ప్రసంగాలు ఇవ్వడం ఈయనకే చెల్లింది. రేవంత్ కు బలంగా మారాయి. ఇప్పుడు సీఎం పీఠాన్ని చేర్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news