కేసీఆర్ కుటుంబంలో న‌లుగురు దుష్ట చ‌తుష్టం : రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్ర‌వ‌రి 17న నిరుద్యోగ దినోత్స‌వ‌మే అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఇంట్లో ఉన్న వాళ్లంద‌రికీ ఉద్యోగాలు వ‌చ్చాయి. పేద ప్ర‌జ‌ల ఇండ్ల‌లో ఉద్యోగాలు ఏవి అన్నారు. నీ కొడుకు మంత్రి ప‌ద‌వీ అడిగామా..? కొడుకు ఆస్తిలో వాటా అడిగామా..? ఉద్యోగ నోటిఫికేష‌న్లు మాత్ర‌మే అడిగాం. కేటీఆర్ వాల్ల అయ్య‌కు దినాలు పెట్టాల‌ని అనుకుంటున్నారు.

ముఖ్య‌నాయ‌కులు చ‌నిపోతే మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తారు. కానీ ముఖ్య‌మంత్రి పుట్టిన రోజు వేడుక‌లు మూడు రోజులు చేసి ప్ర‌జ‌ల సొమ్ము వృధా చేస్తున్నార‌ని ఆగ్ర‌హం చేశారు. కేటీఆర్ ద‌రిద్రుడు అని.. సంతోషానికి, సంతాపానికి తేడా తెలియ‌ద‌ని.. న‌క్స‌లైట్లు ఉంటే బాగుండు అనిపించింది. నిర‌స‌న తెలిపితే నీకు వ‌చ్చిన ఇబ్బంది ఏమిటి..? మా వాళ్లు నిర‌స‌న తెలిపారు. ముఖ్యంగా పోలీస్ మిత్రుల‌కు చెబుతున్నాను. డూడూ బ‌స‌వ‌న్న మాదిరిగా మార‌కండి.. ఈ ప్రభుత్వానికి నిర‌స‌న చెబుతాం. పోలీసుల‌తో అడ్డుకుంటాం అనుకుంటున్నారు అది జ‌ర‌గ‌దన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news