ఆ భూములపై కేసీఆర్ కన్నుపడ్డది.. సినిమా వాళ్లకిస్తడట : రేవంత్ రెడ్డి

-

ముఖ్యమంత్రి కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అందమైన రాచకొండ భూములపై కేసీఆర్ కన్నుపడిందని ఆరోపించారు. రాచకొండ భూముల నుంచి గిరిజనులను వెళ్లగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ భూములను సినిమా పెద్దలకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజలను తాగుడుకు బానిసలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను మద్యం మత్తులో ముంచి సమస్యలపై చర్చ జరగకుండా చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో, దేశంలో అధికార పార్టీలకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీనే అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇద్దరికి శత్రువు అయిన కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి ద్రోహులను కొని కుట్ర చేస్తున్నాయని వెల్లడించారు.

”ఈ ఎన్నికల్లో మద్యం పోయకుండా ఓట్లు అడుగుదామని పాల్వయి స్రవంతి సవాల్ విసిరారు. కానీ వాళ్లు మాత్రం మద్యం ద్వారా, డబ్బుల పంపిణీ ద్వారా గెలవాలి అని చూస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ కు ప్రతిపక్షం కాంగ్రెస్, జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్‌ యే ప్రతిపక్షం. అందుకే ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయి.” – రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Read more RELATED
Recommended to you

Latest news