రైతుల చావుకు కారణమైన టీఆరెస్- బీజేపీని రైతులు ఉరేస్తారని ఫైర్ అయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ లోని తాజా పరిస్థితుల పై గవర్నర్ కు నివేదిక ఇచ్చామని.. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని… మిల్లర్ల దగ్గర ధాన్యం సేకరణ వివరాలు ఉన్నాయి.. వాళ్లకు బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
8లక్షల 34వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని.. 2వేల 6వందల కోట్ల విలువైన బియ్యం కపించకపోతే సీబీఐ విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే గల్లీలో ఒకరు- ఢిల్లీలో ఒకరు ధర్నాలు చేస్తున్నారు… వడ్లు కొనాల్సింది పాకిస్తాన్ ప్రధాని కొనాలా అని మోడీని అడుగుతున్నా పంట వేయకుండా పడావు పెట్టిన ఎకరాకు 15వేల చొప్పున్న రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అవకతవకల పై విజిలెన్స్ ఈక్వయిరి చేయాలని.. వడ్లు- బియ్యం మాయం చేసిన వాళ్ళ పై సీబీఐ విచారణ చేయాలన్నారు. కేసీఆర్ అవినీతిపై వివరాలు ఉంటే ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవడం లేదు ? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు గురించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాటం చేసిందని.. బీజేపీ నేతలకు సిగ్గు లేదు- లజ్జతప్పి మాట్లాడుతున్నారని ఓ రేంజ్ లోఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని.. కేసీఆర్ మెడలు వంచి రైతులకు మద్ధతుదర ఇప్పిస్తామన్నారు.