గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించిందని.. కానీ టీఆరెస్, బీజేపీ నేతలు ఎందుకు తపించుకు తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహించారు. కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయడంలేదు ? అని నిలదీశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే టీఆరెస్, బీజేపీ ల కుట్ర అన్నారు.
టీఆరెస్ పాలనలో కొడంగల్ కు తుప్పు పట్టింది..డ్రామారావు దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి అన్నారు. పాలమూరు రంగారెడ్డి తప్ప టీఆరెస్ కు ఏ ప్రాజెక్టుతో సంబంధం లేదు.అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదు? అని పేర్కొన్నారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్ కు టీఆరెస్ ఎమ్మెల్యే ఉన్నారు.నాలుగేళ్ళ కాలంలో ఏం అభివృద్ధి చేశారో కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.