ఔటర్ రింగు రోడ్డును ముంబై కి చెందిన IRB సంస్థకు అమ్మారు – రేవంత్‌ రెడ్డి

-

ఔటర్ రింగు రోడ్డును ముంబై కి చెందిన IRB సంస్థకు అమ్మారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు బిడ్ ఖరారు వరకు జరిగిన అక్రమాలను కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చిందని వివరించారు. టెండర్ సాధించిన వారికి లెటర్ of అగ్రిమెంట్ తర్వాత ముప్పై రోజుల్లో 10 శాతం చెల్లించాలని.. 738 కోట్ల రూపాయలను ముప్పై రోజుల్లో IRB సంస్థ HMDA కు చెల్లించాలని పేర్కొన్నారు.

ఇంకా 10 శాతం ఆ కాంట్రాక్టు సంస్థ చెల్లించలేదు…ఆ కాంట్రాక్ట్ సంస్థకు లాభం జరిగేలా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు కేటీఆర్… ఆ కాంట్రాక్ట్ సంస్థ ఆర్థికంగా బాగా ఉందని ఇప్పటి దాకా బుకాయించారని ఫైర్‌ అయ్యారు. నిధులు లేవు ….120 రోజుల సమయం కోరింది ఆ కాంట్రాక్ట్ సంస్థ అని.. HMDA లో CE గా పని చేసి రిటైర్డ్ అయిన వ్యక్తినీ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ LTD ఎండీ గా BLN రెడ్డీని సంతకాలు పెట్టేందుకు తీసుకువచ్చారన్నారు.

సంతోష్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ను అక్కడ నుంచి హడావుడి గా బదిలీ చేశారు… IRB సంస్థ సింగపూర్ సంస్థ కు 49 శాతం వాటా అమ్మారని ఆగ్రహించారు. కేటీఆర్ అక్రమ సంపాదన ను విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకోడానికి వెళ్ళారని ఫైర్‌ అయ్యారు రేవంత్ రెడ్డి. సింగపూర్ సంస్థ ఫ్రంట్ ఎండ్ లో ఉండి వాటా కొనుగోలు చేస్తుంది.. ఈ కంపెనీ వెనుక షెల్ కంపెనీలు వస్తాయి.. వీటి వెనుక ఉన్న రాజులు,యువ రాజులు ఎవరో బయటకు రావాలని.. ఎల్లుండి లోపు IRB సంస్థ 10 శాతం HMDA కు చెల్లించాలని.. లేకపోతే టెండర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news