కాంగ్రెస్ లో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి – రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీలో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న నిజామాబాద్‌ జిల్లాలో మోడీ సభకు కౌంటర్‌ ఇస్తూ.. ఇవాళ రేవంత్‌ రెడ్డి ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ప్రధాని మోడీ మాటల్లో.. brs.. బీజేపీ ఫెవికాల్ బంధం బయట పడిందని.. రాహుల్ గాంధీ చెప్పినట్టు brs.. బీజేపీ కి బంధువుల సమితి అని స్పష్టం అయ్యిందని ఆరోపించారు.

తెలంగాణ లో కాంగ్రెస్ గాలి విస్తోంది… చీకటి మిత్రుడు కేసీఆర్ ని గెలిపించడానికి మోడీ తెలంగాణ వస్తున్నారని ఫైర్‌ అయ్యారు. బీజేపీకి డిపాజిట్ రాకున్నా ఇబ్బంది లేదు కానీ..కేసీఆర్ ని గెలిపించాలని తపన మోడీదన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు నే అపహస్యం చేసిన మోడీ.. తన మిత్రుడు కేసీఆర్ తో జరిగిన చర్చలు బయట పెట్టారు… ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ను అరెస్ట్ చేయొద్దు అని కూడా చెప్పి ఉంటే బాగుండేదని ఆగ్రహించారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news