Revanth Reddy Photo On Bathukamma: రేవంత్ రెడ్డి చిత్రంతో బతుకమ్మ పేర్చారు. ఈ సంఘటన కేటీఆర్ నియోజక వర్గం సిరిసిల్లాలో చోటు చేసుకుంది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా పూలు పేర్చి బతుకమ్మను చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

బతుకమ్మకు చెరువులకు అనుబంధం ఉంది.. వాటిని కాపాడుకోవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ అంటేనే వాగులు, వంకలు, గుట్టలు, చెరువులు.. బతుకమ్మలోని ప్రతి పువ్వుకు ఔషధ గుణాలు ఉన్నాయని తెలిపారు. చెరువులో వేసిన పువ్వులు, పసుపుతో నీరు శుద్ధి అవుతుందని… బతుకమ్మను కాపాడుకోవాలి.. భవిష్యత్ తరాలకు బతుకమ్మను అందించాలని మంత్రి సీతక్క పిలుపు నిచ్చారు.