కేసీఆర్ బొక్కలన్ని తెలుసని…ప్రభుత్వాన్ని కూలదోయడంలో మేమే కీలకం అన్నారు రెవెన్యూ సంఘం మాజీ నేత లచ్చిరెడ్డి. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసిన రోజు ఇదని.. ఐదు వేల మంది జీవితం నాశనం అయ్యిందని ఆగ్రహించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి ఇలా వ్యవహరిస్తారని అనుకోలేదని.. ప్రభుత్వమే రెవెన్యూ వ్యవస్థ… ఈ వ్యవస్థను సక్రమంగా చూసుకుంటే ప్రభుత్వం బాగుంటుందని ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పేవారని తెలిపారు.
వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన 22 నెలల తర్వాత ఎవర్ని సంప్రదించకుండా ఇతర శాఖల్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహించారు. రెవెన్యూ వ్యవస్థలో మేము చేసిన తప్పేంటో చెప్పాలని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేదు… రెవెన్యూ వ్యవస్థను అనాథను చేశారన్నారు. వ్యవస్థలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. అన్ని బయట పెడతాం.. ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీయగలమన్నారు. ఎన్నికల సమయంలో మా సత్తా చాటుతం.
వేలాది పోలింగ్ స్టేషన్లు మా చేతుల్లోనే ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కూలదోయడంలో రెవెన్యూ వ్యవస్థ కీలకమని.. 121 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధరణి విషయంలో ఐఏఎస్ కూడా కంప్యూటర్ ఆపరేటర్ మీద ఆధార పడుతున్నారు. అందర్ని వేలిముద్ర వాళ్ళను చేశారన్నారు. సంతకాల సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగస్తులను ఉద్యోగంలో నుంచి పీకగలవా? నీకు అంత దమ్ము ఉందా? 15 రోజుల్లో జీవో వెనక్కి తీసుకోకపోతే రెవెన్యూలో సమ్మె చేపడతామని హెచ్చరించారు.