రైతులకు షాక్‌… ఫిబ్రవరి చివరి వరకు రైతు బంధు నిధులు ?

-

 

తెలంగాణ రాష్ట్ర రైతులకు షాక్‌. యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు సాయం అందించారో? ఎన్ని నిధులు విడుదల చేశారన్న దానిపై స్పష్టత లేదు.

Rythu Bandhu funds until the end of February

రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు సాయం అందినట్లు తెలుస్తుండగా…. ఎకరం భూమి గల కొందరు రైతులు కూడా తమకు పెట్టుబడి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఫిబ్రవరి నెలాఖరులోగా రైతుబంధు డబ్బులు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.

ఇక అటు… తెలంగాణ రేషన్ కార్డు దారులకు శుభవార్త. కొత్త రేషన్ కార్డుల అంశంపై రానున్న కేబినెట్ బేటిలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కొత్త కార్డులకు మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం, ఇదివరకే ఉన్న కార్డులో కుటుంబసభ్యుల్ని చేర్చే విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో భారీగా విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news