ఇంటర్ విద్యార్థులకు షాక్..3 రోజులే సంక్రాంతి సెలవులు

-

ఇంటర్ విద్యార్థులకు షాక్ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, గురుకులాలకు జనవరి 14 నుంచి 16వ తేదీ వరకు 3 రోజులే సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు.

ఈ మేరకు తాజాగా ప్రకటన జారీ చేశారు. జనవరి 17న కాలేజీలు పునః ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇక అన్ని రకాల స్కూళ్లకు మాత్రం అకాడమీ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి 17 వరకు, 5 రోజులు ఉండనున్నాయి. అధికారికంగా మాత్రం ఉత్తర్వులు వెలువడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news