పోడు రైతులకు శుభవార్త చెప్పిన సర్కార్

-

రాష్ట్రంలోని పోడు రైతులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. గిరిజన ప్రాంతాలలో పోడు రైతులకు జనవరి నెలలోనే పట్టాలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఇప్పటికే గ్రామ, డివిజన్ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. జిల్లా కమిటీల ఆమోదం తర్వాత హక్కులు కల్పిస్తామని వెల్లడించారు మంత్రి సత్యవతి రాథోడ్.

కొత్తగా మూడు గిరిజన గురుకులాలను ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆదివాసీలకు ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెరిగాయన్నారు. గిరిజన గురుకులాల్లో చదివిన 1200 మంది విద్యార్థులకు దేశవ్యాప్తంగా ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత విద్యా చదువుకుంటున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news