రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో సీతక్క పొరపాటు.. యశ్వంత్ సిన్హాకు బదులు

-

దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తెలంగాణలోని అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం ఎంపీలు 776, ఎమ్మెల్యేలు 4,033 ఉన్నారు.

మొత్తం ఓటర్లు 4,809 మంది ఉన్నారు.అయితే ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో ఓటు వేయడం లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేశారు. విపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు బదులు పొరపాటున ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఫోటోపై క్లిక్ చేశారు. అయితే వెంటనే పొరపాటు గుర్తించిన సీతక్క మరో బ్యాలెట్ పేపర్ కావాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కోరారు. అయితే అధికారులు ఆమెకు మరో బ్యాలెట్ ఇచ్చే విషయముపై పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news