సైబర్ నేరగాళ్ల చేతిలో 16 కోట్ల 80 లక్షల మంది పర్సనల్ డేటా

-

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. 16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా చోరీ కి గురి అయిందని తెలిపారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. డిఫెన్స్ , ఆర్మీ ఉద్యోగుల కు చెందిన సెన్సిటివ్ డేటా ను సైతం అమ్మకానికి పెట్టారు..ఈ డేటా అంతా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారని తెలిపారు. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.. ఈ విషయాలను తెలిపారు. ఈ డేటా చోరీ దేశ భద్రత కు ముప్పు అని చెప్పారు.

అన్ని ప్రముఖ బ్యాంక్ లకు చెందిన కోట్ల మంది క్రెడిట్ , డెబిట్ కార్డ్ డేటా ను చోరీ చేశారు..నిందితులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మహిళల కు చెందిన వ్యక్తిగత వివరాలు సైతం చోరీ చేసి..నేరగాళ్లకు అమ్ముకున్నారు.. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ కోసం ఒక ఏజెన్సీ నీ పెట్టుకున్నారు..ఆ ఏజెన్సీ ఉద్యోగి డేటా ను అమ్ముకున్నాడని వివరించారు. ఇన్సూరెన్స్ , లోన్స్ కోసం అప్లై చేసిన 4 లక్షల మంది డేటా చోరీ చేశారన్నారు. ఫేస్ బుక్ యూసర్స్ డేటా 7 లక్షలు అని.. ఫేస్ బుక్ వాడే వారి యూజర్ id, పాస్ words కూడా దొంగిలించారని వివరించారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.

Read more RELATED
Recommended to you

Latest news