తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను తప్పక అమలు పరిచే అభయ హస్తంపై తొలి సంతకం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగురాలైన రజినీకి ఉద్యోగం ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సీఎంగా రజినీ ఉద్యోగ నియామక ఫైల్ పై రెండో సంతకం చేశారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాన్ని దివ్యాంగురాలు అయినటువంటి రజినీకి అందజేశారు.
రాష్ట్రంలో అధికార మార్పిడి జరగగానే ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు ప్రారంభమయ్యా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారులు బదిలీల ప్రాసెస్ మొదలైంది. అదేవిధంగా మంత్రులకు కూడా శాఖలను కేటాయించారు. తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని సీఎంవో ముఖ్య కార్యదర్శిగా వి శేషాద్రిని నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక బాధ్యతలు అధికారుల నియామకం జరగనున్నట్టు సమాచారం.