కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తే ఓడిస్తాం – షబ్బీర్ అలీ

-

కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తే ఓడిస్తామని పేర్కొన్నారు షబ్బీర్ అలీ. కామారెడ్డి ఉగ్రవాయి హాత్ సే హాత్ జోదో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. ఈ సందర్భంగా మాట్లాడారు. కామారెడ్డికి కేసీఆర్ వచ్చినా ఎవరు వచ్చినా పోరాడుతానని స్పస్టం చేశారు. హుజూరాబాద్ లో 10 లక్షలు ఇచ్చినట్లు కామారెడ్డి లో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

గంప గోవర్దన్ ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ను రమ్మంటున్నారని చురకలు అంటించారు. కామారెడ్డి నియోజక వర్గంలో నేను కట్టించిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి తప్ప డబుల్ బెడ్ రూం లు ఇవ్వలేదని ఆగ్రహించారు. Brs నాయకులు ఊళ్ళల్లోకి వస్తె డబుల్ బెడ్ రూం లపై ప్రశ్నించండన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ.

Read more RELATED
Recommended to you

Latest news