చంద్రబాబుతో కలిస్తే పవన్ కు ఎన్టీఆర్ కు పట్టిన గతే పడుతుంది – కొడాలి నాని

-

పవన్ పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు, అవసరం కోసం వాడుకోవడం ఉంటుందని…చంద్రబాబుతో కలిస్తే పవన్ కు ఎన్టీఆర్ కి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పవన్ ప్రజల్లో తిరగవచ్చు, జగన్ మీద విమర్శలు చేయవచ్చని…రాజకీయాల్లో ఉండే దొంగలను, 420లను పక్కన పెట్టాలని కోరారు. పవన్ ప్రజల మధ్య వారాహి యాత్ర చేస్తే ఇబ్బంది ఏమీ లేదు…పవన్ తో నేరుగా కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తే కుదరలేదని వెల్లడించారు.

చంద్రబాబు ఎప్పుడూ సీఎంగా ఉండాలని కోరుకునే వారు పవన్ కు మద్దతు దారులు మారారని ఎద్దేవా చేశారు. పవన్ మద్దతుతో చంద్రబాబుని ప్రతిపక్ష నేతగా చేయాలని ఆయన మద్దతు దారులు భావిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మద్దతుదారులతో కలిసి పవన్ మాపై దాడి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ అమలు చేస్తే రాజకీయంగా ఎదుర్కొంటామని వార్నింగ్‌ ఇచ్చారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వారు ఎవరైనా బట్టలు ఊడదీసి రోడ్డు మీద నల బెడతామని హెచ్చరించారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news