రైతుల ఆందోళనపై కేటీఆర్ వ్యంగంగా మాట్లాడడం సిగ్గుచేటు – ఎంపీ లక్ష్మణ్

-

కామారెడ్డిలో రైతుల ఆందోళన పై మంత్రి కేటీఆర్ వ్యంగంగా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు బిజెపి ఎంపీ లక్ష్మణ్. రైతులను ఎగతాళి చేసి మాట్లాడడాన్ని ఖండించారు. సీఎం కేసీఆర్ రైతుల హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు. భూ సేకరణ పేరుతో భూదందాలు చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి లక్షల ఎకరాలు సేకరించారని.. రైతుబంధు ఇచ్చి సబ్సిడీలు నిలిపివేశారని మండిపడ్డారు.

దొడ్డి దారిన కాకుండా గ్రామసభ నిర్వహించి మాస్టర్ ప్లాన్ పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రాబోయే మూడు నెలల్లో ప్రజా సమస్యలపై బిజెపి పోరాటాన్ని ఉదృతం చేస్తుందని తెలిపారు. తెలంగాణను కాపాడుకోవడం కోసం మేధావులు, కవులు, కళాకారులు స్పందించాలని కోరారు. సంక్రాంతి తర్వాత ప్రజా సమస్యలపై మేధావుల సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. కెసిఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకెళ్తామన్నారు లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Latest news