కాంగ్రెస్ లో విలీనం కావడానికి నేను పార్టీ పెట్టలేదని వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ లో YSRTP విలీనం చేస్తున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని అనుకుంటే నేను పార్టీ ఎందుకు పెట్టాలి.. విలీనం చేయాలని అనుకుంటే రెండేళ్లుగా కిందపడి మీదపడి పార్టీని ఎందుకు నడపాలన్నారు.
విలీనం చేయాలని అలోచన ఉంటే 3800కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు చేయాలని..విలీనం చేయాలని అనుకుంటే పార్టీ పెట్టకముందే నాకు ఎన్నో ఆఫర్లు ఉన్నాయని తెలిపారు. అవన్నీ కాదని వైఎస్సార్ పేరు మీద పార్టీ పెట్టింది విలీనం చేయడానికి కాదని వెల్లడించారు షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఒక ఫోర్స్ లా తయారయ్యింది.. తెలంగాణాలో షర్మిల అంటే తెలియని వాళ్లు లేరని వివరించారు. డిల్లికి చెందిన ఒక సర్వే సంస్థ 44సీట్లలో ప్రభావం చూపిస్తుందని తేలింది.. ఇది నేను చేసిన సర్వే కాదు. నాకు సంబందం లేదన్నారు. 44 సీట్లలో నా ప్రభావం ఉంటే.. 5 సీట్లకో…10సీట్లకో పొత్తులకు పోవాల్సిన అవసరం నాకు లేదని తెలిపారు.