కేసీఆర్, నీ పాపాలపుట్ట పగులుతోంది – షర్మిల

-

కేసీఆర్, నీ పాపాలపుట్ట పగులుతోందని వైఎస్‌ షర్మిల విమర్శలు చేశారు. నీ నేరాలచిట్టా నాగుపామై కాటేసే రోజు దగ్గరలో ఉందని విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అవినీతిపై ఢిల్లీలో కాగ్ ని కలిసి ఆధారాలతో అందించిన ఫిర్యాదుకు, మా అవిశ్రాంత పోరాటానికి ఫలితం షురూ, ఇక మీ సర్కారు పతనం పెండింగ్ అన్నారు.


ఖబర్దార్ 420 కేసీఆర్, నీకు కూడా జైలు ఖాయమని హెచ్చరిం చా రు. దొంగలు ఎవర్రా అంటే భుజాలు తడుముకునట్లు ఉంది చిన్నదొర ప్రెస్ మీట్. ఏ తప్పూ చేయకుం టే “ఈడీ, బోడీ”లకు భయమెందుకు? కేంద్రం చేతిలో ఈడీ తోలుబొమ్మ అయితే.. మీ సర్కారు చేతిలో పోలీసు శాఖ కీలుబొమ్మ కాదా? వాస్తవాలు బయటకు చెప్పే మీడియాపై చిన్నదొరకు ఎందుకు అంత అసహనం? సొంత మీడియాను జనం నమ్మడం లేదనా? నీ చెల్లి నిర్దోషి అయితే, మొత్తం లిక్కర్ దందాలో ఏం జరిగిందో చెప్పు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news