BRS అంటే ‘బంధిపోట్ల-రాష్ట్ర-సమితి’ – షర్మిల

-

BRS అంటే ‘బంధిపోట్ల-రాష్ట్ర-సమితి’ అని చురకలు అంటించారు వైఎస్‌ షర్మిల. ‘బీఆర్ఎస్’ అంటే ‘బంధిపోట్ల-రాష్ట్ర-సమితి’ అని ఊరికే అనలేదు! నడిరోడ్డుపై దళిత న్యాయవాది కారు అద్దాలు పగలగొట్టి.. రక్తమోడేలా దాడి చేసి.. చంపేస్తామంటూ బెదిరించడం బంధిపోట్లకే సాధ్యం అని ఎద్దేవా చేశారు. దళితబంధు అక్రమాలను ఎత్తిచూపిన అడ్వకేట్ యుగేందర్ మీద బీఆర్ఎస్ గూండాల దాడిని YSRTP తీవ్రంగా ఖండిస్తుంది.

దళితుల జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం YSRTP పోరాడుతుందని తెలిపారు. బంధిపోట్ల రాష్ట్ర సమితి అంటే నాపై హుటాహుటిన కేసు నమోదు చేయించిన కేసీఆర్.. దళిత న్యాయవాదిపై దాడికి దిగిన BRS బంధిపోట్లకు మాత్రం గొడుగు పడుతున్నారని ఆగ్రహించారు. దళిత ముఖ్యమంత్రి నుంచి దళితబంధు వరకు అన్ని రకాలుగా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని.. కేసీఆర్ సొంత రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు పోరాడే హక్కు లేదు. మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. అందుకే అన్నాం.. టీఆర్ఎస్ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి అని..!బీఆర్ఎస్ అంటే బంధిపోట్ల రాష్ట్ర సమితి అని…! అంటూ ట్వీట్‌ చేశారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news