లోకేష్ పప్పుగాడు కాదు.. కమెడియన్ సంపూర్ణేష్ బాబు లాంటోడు – ఎమ్మెల్యే కాటసాని

-

నంద్యాల: బనగానపల్లె బహిరంగ సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన విమర్శలకు ఘాటుగా బదిలిచ్చారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ప్రభుత్వ భూమి 100 ఎకరాలు అమ్ముకున్నానని నిరూపిస్తే రాజీనామా చేస్తానని.. ఒకవేళ నిరూపించ లేకపోతే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా..? అని నారా లోకేష్ కి సవాల్ విసిరారు. ఫ్యాక్షన్ ప్రాంతం కాబట్టే ఎలాంటి గొడవలు చేయొద్దని కార్యకర్తలకు సూచించానని.. లేకుంటే బనగానపల్లె గేటు దాటలేవని నారా లోకేష్ ని హెచ్చరించారు.

నన్ను కమిషన్ల కాటసాని అంటావా.. నీయబ్బ ఏమిలేని 2ఎకరాల నా కొడుకువి నువ్వు.. నీకు రెండు లక్షల కోట్లు ఎలా వచ్చాయి..? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమ ఫ్యాక్షన్ గ్రామాల్లో ఇన్ని హత్యలు జరిగాయంటే మీ నాన్నే కారకుడని చంద్రబాబు పై మండిపడ్డారు. లోకేష్ ఏం పీకుతాడు.. వాడు ఒక తిక్క నా కొడుకు అని తీవ్ర విమర్శలు చేశారు. ఏదైనా మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు ఎమ్మెల్యే కాటసాని. లోకేష్ పప్పుగాడు కాదు.. కమెడియన్ సంపూర్ణేష్ బాబు లాంటోడు, వాడొక జోకర్ అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ గెలవలేవ్ అని, అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేవు.. ఇదే నా శాపం అని శపించారు కాటసాని. బిసి జనార్దన్ రెడ్డి.. వ్యక్తిగతంగా మాట్లాడితే నాలుక కోస్తా.. నా తడాఖా ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. పాత రామిరెడ్డిని చూస్తే బిసి డ్రాయర్ విప్పి పరిగెత్తాలని అన్నారు. నేను తలుచుకుంటే తిరగలేవని, నీ బట్టలు ఉతికే దానికి కూడా మనుష్యులు దొరకరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news